PM Modi: “ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు”.. లాలూ వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింల పూర్తి రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంపై వివాదం మొదలైంది. పాట్నాలో మీడియాతో మాట్లాడిన లాలూ యాదవ్ రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని అధికార బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారని ఆర్జేడీ అధినేత అన్నారు.
Read Also: Pannun murder plot: ఖలిస్తాన్ పన్నూ హత్య కుట్రలో భారత్ దర్యాప్తుపై అమెరికా ఎదురుచూపు..
Also Read
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
లాలూ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలను మానలేదని, వారికి ఓటేస్తే మీరు శ్వాసించే హక్కును కూడా తీసుకుంటారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ మాట్లాడుతూ.. దాణా కుంభకోణంలో నిందితుడు బెయిల్‌పై బయట ఉన్న నాయకుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అంటున్నారని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రధాని అన్నారు. ‘‘ కాంగ్రెస్ మౌనంగా ఉంది. కానీ ఈ రోజు దాని మిత్రపక్షాలలో ఒకటి ఇండియా కూటమి ఉద్దేశాలను ధ్రువీకరించింది. ముస్లింలకు ‘సంపూర్ణ’ రిజర్వేషన్లు కావాలని ఆయన అన్నారు. దీని అర్ధం ఏమిటి..?’’ అని ప్రశ్నించారు. తాను జీవించి ఉన్నంత కాలం ‘‘బూటకపు సెక్యులరిజం’’ పేరుతో భారతదేశ గుర్తింపును చెరిపేయడానికి ఎవరినీ అనుమతించనని అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేయడం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో పూర్తిగా రిజర్వేషన్లు అనేది చాలా తీవ్రమైందని, వారు ఎస్టీ/ఎస్టీ, ఓబీసీ వాటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆర్జేడీకి యాదవులను కాదని ముస్లింలు తొలి ప్రాధాన్యంగా మారిందని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!