L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- కేంద్రమంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా..
- తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని మోడీకి లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
L Murugan Resigns: కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి ఎల్. మురుగన్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోడీకి ఎల్ మురుగన్ లేఖ రాశారు. తన భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
తాను ఇప్పుడు పూర్తి సమాయాన్ని తమిళనాడులో బీజేపీ బలోపేతానికి, 2029 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి కేటాయించాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేడయంతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే తన ప్రాధాన్యత అని అన్నారు.
Also Read
మోడీకి రాసిన లేఖలో తాను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి వచ్చానని, తన కష్టాలను వివరించారు. తన తల్లిదండ్రులు రోజూవారీ కూలీలుగా, పశువుల కాపరులుగా పనిచేశారని, ఇప్పటికీ తన కుటుంబం తమిళనాడులోని కోనూర్‌లో సాదాసీదా జీవితం గడుపుతోందని తెలిపారు. తమ కుమారుడు ఒకరోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అవుతాడని తన తల్లిదండ్రులు ఎప్పుడూ ఊహించలేదని ఆయన అన్నారు. తన రాజకీయ ప్రస్థానానికి ప్రధాని మోదీ నాయకత్వం, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎదిగేందుకు అవకాశాలు కల్పించే బీజేపీ సంప్రదాయమే కారణమని మురుగన్ పేర్కొన్నారు.
మురుగన్ రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ వైస్-ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన గత 5 ఏళ్లుగా మోడీ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. సమాచార మరియు ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలు, మత్స్య, మరియు పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.
తాజావార్తలు
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!