PM Modi: తమిళనాడు అభివృద్ధి మా ప్రధాన నిబద్ధత అని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. తూత్తుకూడి ఏయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్‌ని ఆయన శనివారం ప్రారంభించారు. గత దశాబ్ధంతో పోలిస్తే, ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కన్నా ఎక్కువ నిధుల్ని తమిళనాడుకు ఇచ్చిందని అన్నారు. ఒ
AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో పాటు పార్టీల మధ్య పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) ఎంట్రీతో తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీతో చేతులు కలపడానికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) శనివారం చెప్పారు. బీజేపీతో తన పొత్తలో అన్నాడీఎంకే పెద్దన్న అని చెప్పారు.
AIADMK-BJP: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళని స్వామి, కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలు కూడా గంటల తరబడి చర్చించారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-అన్నాడీఎంకేల పొత్తు తెర పైకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.