కోలీవుడ్‌లో వర్సటైల్ ఫిల్మ్ మేకర్లు ఎవరంటే.. లోకేశ్, కార్తీక్ సుబ్బరాజ్, అట్లీ, నెల్సన్, వెట్రిమారన్ అంటూ చెప్పుకుంటున్నాం కానీ వీరందరి కన్నా ముందే ఓ మూసలో కొట్టుకుపోతున్న తమిళ సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు మురుగుదాస్. బాక్సాఫీస్ కలెక్షన్ అంటే ఇవి అని గజినితో టేస్ట్ చూపించాడు. ఇక్కడే కాదు గజినీ రీమేక్‌తో బాలీవుడ్‌కు కూడా ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీని అందించాడు. అటు కోలీవుడ్ ఇటు నార్త్ బెల్ట్‌లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ స్టార్ డైరెక్టర్ ప్రజెంట్ సల్మాన్ ఖాన్‌తో సికిందర్ తెరకెక్కిస్తున్నాడు.
Also Read : kiccha Sudeep : దూకుడు పెంచుతోన్న కిచ్చా.. హిట్ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్
దర్బార్ ఫెయిల్యూర్ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న మురుగుదాస్ సికిందర్‌ను తెరకెక్కిస్తున్నారు. హిందీలో అతడికి ఇది ఫోర్త్ డైరెక్టోరియల్ వెంచర్. సల్మాన్ ఖాన్‌తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.ఈద్ సందర్భంగా సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో అప్ కమింగ్ సినిమాల ముచ్చట్లను పంచుకున్నాడు. సికిందర్ కంప్లీట్ కాగానే శివకార్తీకేయన్ సినిమాకు షిఫ్ట్ అవుతాడట. అలాగే అమీర్ ఖాన్‌తో గజిని సీక్వెల్ కూడా ఉండబోతుందని చెప్పాడు. ఇప్పటికే చర్చలు జరిగాయని పేర్కొన్నాడు. గజిని 2 చేయబోతున్నట్లు మురుగదాస్ ఎనౌన్స్ చేశారో లేదో రూమర్లు స్టార్టయ్యాయి. ఈ సినిమాను బైలింగ్వల్‌గా తెరకెక్కించనున్నారని తమిళంలో సూర్యతో, హిందీలో అమీర్‌తో తీయబోతున్నారన్న మేటర్ సర్క్యులేట్ అవుతుంది. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌తో పాటు షారూఖ్ ఖాన్‌కు కూడా టార్గెట్ చేయబోతున్నాట మురుగదాస్. షారూక్‌ని డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాడని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం.