విక్రాంత్ రోణా తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మ్యాక్స్ మూవీతో బాక్సాఫీసును దుల్లగొట్టేశాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచాడు. ఎప్పుడో ఎనౌన్స్ చేసిన కిచ్చా 47 మళ్లీ లైన్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బిల్లా రంగా బాషాను మార్చిలో సెట్స్ పై తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ సెట్ కాలేదు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విక్రాంత్ రోణ ఫేం అనూప్ భండారీ దర్శకత్వంలో ప్రాజెక్ట్ ఉండబోతుంది.
Also Read : Mad Square : భీమ్స్ ను కాదని తమన్ ను ఎందుకు..?
ఏడాదిన్నరలో రెండు సినిమాలను దించేస్తానని గతంలో ప్రామీస్ చేసిన కిచ్చా సుదీప్ ఆ మాటకు కట్టుబడేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బిల్లా రంగా బాషా తర్వాత కొత్త ప్రాజెక్టు కోసం విపరీతంగా స్ట్రిప్ట్‌లు వింటున్నాడని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకు సుమారు 10 నుండి 12 గంటల పాటు స్టోరీలను వినేందుకు టైం కేటాయిస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఏదీ ఎంగేజింగ్ అండ్ ఎగ్జైటింగ్ అనిపించలేదని టాక్. 2024 ఎండింగ్ లో వచ్చిన మ్యాక్స్ కి సీక్వెల్ తీసుకురావాలన్న యోచనలో ఉన్నాడట కిచ్చా సుదీప్. అందుకే గంటల పాటు కొత్త కథలను వింటున్నాడట. విజయ్ కార్తీకేయన్ దర్శకత్వం వహించిన మ్యాక్స్ కోసం బాగా టైం కేటాయిస్తున్నాడని తెలుస్తోంది. మ్యాక్స్ ఎండింగ్ నుండి సీక్వెల్ ఎలా ప్లాన్ చెయ్యాలో అన్న ప్రిపరేషన్స్ జరుగుతున్నాయట. కన్నడలో కొత్త దర్శకులతో, తెలుగు ఫిల్మ్స్ మేకర్స్‌తో చర్చిస్తున్నాడన్న వార్తలు శాండిల్ వుడ్‌లో వినిపిస్తున్నాయి. ఓ మంచి సినిమాతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్ రెడీ చెయ్యాలని కష్టపడుతున్న కిచ్చా సుదీప్ త్వరలోనే గుడ్ న్యూస్ వస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.