నెయ్యి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

నెయ్యిలో ఉండే ఒమేగా 3 యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.  

ప్రస్తుతం మార్కెట్ లో అలాంటి నెయ్యి కలుషితమై పోతుంది. మీరు తినే నెయ్యి మంచిదా కాదా ఇలా తెలసుకోండి.  

1. ఒక గ్లాసు నీటిలో ఒక చుక్క నెయ్యి వేయండి. నెయ్యి నీటిలో తేలితే అది కల్తీ లేనిది.   

 2. నెయ్యి పూసిన గిన్నెలో ఒక స్ఫూన్ ఉప్పు, చిటికెడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి కలిపి.. సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 

అప్పుడు అది ఎర్రగా మారితే మీ నెయ్యి కల్తీ అని, కాకపోతే కల్తీ లేనిదని తెలుసుకోవచ్చు.

3. మరిగించిన నీటిలో.. కాస్త నెయ్యి వేసి పక్కన పెట్టుకోవాలి. కొంత సమయం తర్వాత నీటిపై పొర విస్తరించినట్లయితే, అది కల్తీ. 

4. చెంచా నెయ్యి తీసుకొని అరచేతిపై పోసి..  రెండు చేతులతో బాగా రుద్ది వాసన చూసుకోవాలి. స్వచ్ఛమైన నెయ్యి దాని వాసన ద్వారా తెలుస్తుంది. 

అదేవిధంగా బాగా రుద్దిన తర్వాత రంగు లేకుండా ఉంటే కల్తీ అంటారు.

మార్కెట్లో దొరికే నెయ్యి కంటే ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్..