Kishan Reddy Fires On CM KCR After BRS Public Meeting: బీఆర్ఎస్ ఒక కలల పార్టీ అని.. ఢిల్లీకి పోతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్లు వేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీని తిట్టేందుకు ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారన్నారు. ఏ ఒక్క నేత కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదన్నారు. కేసీఆర్ పెట్టుకున్న ఆ టోపీ, ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే.. నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 4500 వెల్నెస్ సెంటర్లను తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని.. వాటి పేర్లను మార్చి, బస్తీ దవాఖాన పెట్టారని అన్నారు. మోడీని ఎంత విమర్శిస్తే.. తమకు అంత బలం, గౌరవం పెరుగుతుందన్నారు. ఖమ్మం సభలో కేసీఆర్, ఇతర ముఖ్యమంత్రులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Revanth Reddy: మోడీని రక్షించడానికే.. కేసీఆర్ కాంగ్రెస్‌పై నిందలు
లక్ష్యం లేకుండా కేసీఆర్ పని చేస్తున్నారని.. 9 సంవత్సరాలుగా ఆఫీస్‌కు రాకుండా పాలించిన వ్యక్తి అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. కేసీఆర్ అంతరాత్మ తన కుటుంబం కోసమేనని.. కొడుకు సీఎం కావాలని, అధికారం చేయి జారొద్దని ఆయన ఆరాటమని పేర్కొన్నారు. సీఎంగా పనికిరాడని.. దేశం పిలుస్తోందట అంటూ కౌంటరేశారు. రాజకీయంగా బీజేపీని విమర్శించమని, దేశాన్ని మాత్రం అవమానించొద్దని కోరారు. తెలంగాణలో అనేక పరిశ్రమలు వచ్చాయని.. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఎదుర్కొందని చెప్పారు. సకాలంలో వాక్సిన్ తీసుకొచ్చి, ప్రజల ప్రాణాల్ని కాపాడుకున్నామన్నారు. 2014కి, ఇప్పటికి పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కూడా రైతుల ఆత్మహత్యలు తగ్గలేదని.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో ఉందని దుయ్యబట్టారు.
Byreddy Siddarth Reddy: పవన్ కళ్యాణ్ ‘రంగం’ సినిమాలో విలన్ లాంటోడు
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం నష్టాల్లో కూరుకుపోయిందని.. ఆయన మాటలు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల వాగ్ధానాల్లా ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారని.. మీ మనుమడిని నెల రోజులు ప్రభుత్వ హాస్టల్లో ఉంచితే పరిస్థితి తెలుస్తుందని చెప్పారు. వెలుగు జిలుగులు కేవలం ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌లో మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో దోచుకుంటున్నారని ఆరోపించారు. మోడీ ప్రధానిగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదన్నారు. గ్రామ పంచాయితీలకు కేంద్రం ఇస్తున్న నిధుల్ని దారి మళ్లించారన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంది సరిపోకా.. ఇప్పుడు దేశంలోకి అడుగుపెతున్నారని విమర్శించారు. దేశం కాదు తెలంగాణ సమాజం ప్రమాదంలో ఉందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో.. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫార్మ్‌హౌస్‌కు పరిమితం చెయ్యడమే తమ లక్ష్యమన్నారు.
CM KCR: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధు, ఉచిత కరెంటు