Rahul Gandhi vs Kiren Rijiju: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. 1962 యుద్ధం, పేదరికంపై కాంగ్రెస్‌కు 4 ప్రశ్నలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi vs Kiren Rijiju: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం లేకపోవడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నాలుగు ప్రశ్నలు సంధించారు. 1962లో చైనా చేతిలో ఎదురైన పరాభవానికి కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా? దేశాన్ని ఇన్నేళ్లు పేదరికంలో ఎందుకు ఉంచింది? అంటూ ప్రశ్నించారు.
1962 యుద్ధంపై కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా?
శనివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన నాలుగు ప్రశ్నలను ప్రస్తావించారు.
Also Read
- Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
- Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
- Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
- IIT Kharagpur Turns 75: దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర.. 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ ప్రశంసలు!
1962లో చైనా చేతిలో ఎదురైన పరాభవానికి కాంగ్రెస్ క్షమాపణ చెబుతుందా? చైనా ఆక్రమణకు గురైన ప్రాంతంలో తన గ్రామం కూడా ఉందని రిజిజు పేర్కొన్నారు.
భారత్‌ను పేద దేశంగా ఎందుకు ఉంచారు? కాంగ్రెస్ పాలనలో దేశం పేదరికంలో కొనసాగడానికి కారణమేంటని ప్రశ్నించారు.
భారత్‌ను ‘పాములు ఆడించే దేశం’గా ఎందుకు చిత్రీకరించారు? ప్రపంచం ముందు దేశ ప్రతిష్ఠను అలా ఎందుకు చూపించారని నిలదీశారు.
భారత ఆర్థిక వ్యవస్థను ‘హిందూ వృద్ధి రేటు’గా ఎందుకు అవమానించారు? దేశ ఆర్థిక అభివృద్ధిని తక్కువ చేసి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఏమన్నారు?
చైనాలో జరిగిన ఏపీఈసీ (APEC) సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే ఆ కీలక సమావేశంలో భారత ప్రధానమంత్రి కూడా పాల్గొని ఉండేవారని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉంటే భారత ప్రధానమంత్రి కూడా ఆ సమావేశంలో కూర్చునేవారు. రాజీ పడిన ప్రధానమంత్రి ఎప్పటికీ ఆ సమావేశంలో కూర్చోలేరు’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. మోడీని ఉద్దేశించి ‘రాజీ పడిన ప్రధాని’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన కిరణ్ రిజిజు.. రాహుల్ గాంధీ భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. దేశంలో ఉన్నప్పుడు లేదా విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు భారతదేశంపై విమర్శలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. విదేశాల్లో ఉన్న భారత్ వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ కలిసి పనిచేస్తున్నారంటూ రిజిజు ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భారత్ నాగరికత, సంప్రదాయాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బలహీనపరిచేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై రాహుల్‌కు అవగాహన లేదంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, చైనాలో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాహుల్ గాంధీ పానీయాలు అందిస్తున్నట్లుగా రూపొందించిన ఏఐ (AI) చిత్రాన్ని బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఈ చిత్రాన్ని ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘కుచ్ ఐసే’ (ఇలాగే ఉండేది) అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నవ్వుతున్న, ఫైర్ ఎమోజీలను కూడా జత చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi vs Kiren Rijiju: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. 1962 యుద్ధం, పేదరికంపై కాంగ్రెస్‌కు 4 ప్రశ్నలు!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
January 12 Vidudala నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కీర్తి, కృతి!
-
CM Chandrababu: ఓటుకు నోటు వద్దు.. మంచి నాయకుడిని ఎన్నుకోండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు
-
Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
ట్రెండింగ్
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!