Amritpal Singh: ఖలిస్థానీ సానుభూతిపరుడు, వివాదాస్పద నేత అమృత్‌పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ మొత్తం రేపు మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పంజాబ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏడు జిల్లాల పోలీసులు పక్కా ప్రణాళితో ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నాయకుడిని అరెస్ట్ చేశారు. సినిమాను తలపించే విధంగా 100 కార్లు గంటపాటు ఛేజ్ తర్వాత అమృత్ పాల్ సింగ్ ను…
Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు, డ్రగ్స్ అక్రమరవాణాపై చర్చించారు. డ్రగ్స్ మాఫియాకు పాకిస్తాన్ రక్షణ ఇస్తోందని భగవంత్ మన్, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా నివాసంలో దాదాపుగా 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది.
CM Bhagwant Mann: ఖలిస్తానీ వేర్పాటువాదులు, రాడికల్ సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ కార్యకర్తలు, దాని చీఫ్ అమృత్ పాల్ సింగ్ అజ్నాలాలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో మళ్లీ ఖలిస్తాన్ పేరుతోె విభజన బీజాలు నాటాలని ప్రయత్నిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ అనుచరుడు జైలులో ఉన్న లవ్ ప్రీత్ సింగ్ తూఫాన్ ను విడిపించేందుకు పెద్ద ఎత్తున ఖలిస్తానీ వేర్పాటువాదులు కత్తులు, ఇతర ఆయుధాలతో…