Kerala Woman physically assaulted in Bengaluru: బెంగళూర్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. యువతి నిస్సాహాయక స్థితిని ఆసరా చేసుకుని బైక్ ట్యాక్సీ డ్రైవర్, అతని మరో సహచరుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడతల వారీగా ఇద్దరు యువకులు, యువతిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన బెంగళూర్ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో పాటు పశ్చిమబెంగాల్ కు చెందిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Bandi Sanjay: వచ్చేది మా ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే బైంసా పేరు మారుస్తాం..
వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి, శుక్రవారం అర్థరాత్రి మరో స్నేహితుడిని చూడటానికి బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. బైక్ షేరింగ్ యాప్ రాపిడోలో బైక్ బుక్ చేసుకుంది. ఆ సమయంలో మహిళ మద్యం మత్తులో ఉంది. అయితే ఆ సమయంలో బైక్ రైడర్ ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. కానీ ఆమె బైక్ దిగే పరిస్థితిలో లేదు. పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న నిందితుడు సదురు మహిళను తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే కొంత సమయం తర్వాత బైక్ రైడర్ మరో ఫ్రెండ్ వచ్చీ.. ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వంతుల వారీగా ఇద్దరు నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన మహిళ తీవ్ర గాయాలతో బాధపడింది. నిందితుడి ఇంటి నుంచి స్థానికంగా ఉన్న సెయింట్ జాన్స్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి ఆమెను పరీక్షించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఫిర్యాదు ఆధారంగా బెంగళూర్ కు చెందిన ఇద్దరు నిందితులతో పాటు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు.