Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- పెదవి గాయానికి చికిత్స కోసం వెళ్లిన 18 నెలల చిన్నారి మృతి
- అనస్థీషియా తర్వాత స్పృహ కోల్పోయిన బాలుడు
- వైద్య నిర్లక్ష్యమని కుటుంబం ఆరోపణ
- వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: ఆడుకుంటూ పడిపోవడంతో పెదవికి గాయమైందని హాస్పిటల్ తీసుకెళ్తే, 18 నెలల బాలుడు మరణించిన సంఘటన కేరళలో జరిగింది. బాలుడికి అనస్తీషియా ఇచ్చిన తర్వాత అపాస్మారక స్థితికి చేరుకుని చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై చిన్నారి కుటుంబం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఆస్పత్రి యాజమాన్యం మాత్రం బాలుడు కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కన్నూర్ జిల్లాలోని ఎరమం కుట్టూర్కు చెందిన సూరజ్, విజయిష దంపతుల ఏకైక కుమారుడు దేశాంశ్ శౌర్య జూలై 5న ఇంటి బయట ఆడుకుంటూ కిందపడటంతో పెదవికి గాయమైంది. కుటుంబ సభ్యులు తొలుత మథమంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా, అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పయ్యన్నూర్ లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పెదవికి కుట్లు వేయడానికి చిన్నారికి అనస్తీషియా ఇచ్చారు. అనస్తీషియా ఇచ్చిన తర్వాత చిన్నారి స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత కన్నూర్‌లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ బాలుడు శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మరణించాడు.
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
- PM Modi: న్యూజిలాండ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్‌ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరో మైలురాయి
ఈ ఘటనలో వైద్యురాలు అంజలి పొదువల్ నిర్లక్ష్యం కారణమని బాలుడి కుటుంబం ఆరోపిస్తోంది. డాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అనస్తీషియా ఇచ్చిన వెంటనే చిన్నారికి ఊహించనిరీతిలో కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) వచ్చిందని, వెంటనే వెంటిలేటర్ సపోర్ట్ అందించి కన్నూర్ ఆస్పత్రికి తరలించినట్లు ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. సరైన మోతాదులో అనస్తీషియా ఇచ్చిన, చాలా అరుదుగా ఇలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉందని ఆస్పత్రి పేర్కొంది. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్‌లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
-
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!