నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కన్నా ఐదు రోజుల ముందే మే 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ లోపే కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. 10 జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట,…