Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- రూ.3,000 తీసుకుని 9 ఏళ్లు సంబంధం చూపని మ్యారేజ్ బ్యూరో.
- సేవల్లో లోపం జరిగిందని తేల్చిన కన్స్యూమర్ ఫోరం.
- ఫీజు రీఫండ్‌తో పాటు రూ.5,000 నష్టపరిహారం, ఖర్చులు చెల్లించాలని ఆదేశం.
- 30 రోజుల్లో చెల్లించకపోతే 9% వడ్డీ విధింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Bureau: ఇటీవల కాలంలో పెళ్లిళ్ల కోసం చాలా మంది మ్యారేజ్ బ్యూరోల వెంట పడుతున్నారు. మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫామ్‌లలోనే పెళ్లిళ్లు కుదురుతున్నాయి. అయితే, దీని వెనక స్కామ్‌లు కూడా ఇలాగే ఉన్నాయి. పెళ్లి కాని అబ్బాయిలును, అమ్మాయిలను డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లకేళ్లు గడిచినా సంబంధాలు సెట్ చేయడంలో విఫలమవుతున్నారు. రేపు మాపు అంటూ అబ్బాయి లేదా అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నారు.
ఇలాంటి మ్యారేజ్ బ్యూరోకు కేరళలో షాక్ తగిలింది. కన్నూర్‌లోని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (కన్జ్యూమర్ కోర్టు) ఒక మ్యారేజ్ బ్యూరోపై భారీ ఫైన్ విధించింది రూ. 3000 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని 9 ఏళ్ల పాటు సరైన వివాహ సంబంధం చూపించడంలో విఫలమైంది. ఈ కేసులో మ్యారేజ్ బ్యూరో సేవల్లో లోపం ఉందని గుర్తించిన కోర్టు ఫీజు చెల్లించడంతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి బాధ్యులు వారే.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణపై భారత్ సీరియస్..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
కన్నూర్‌కు చెందిన ఓ నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ 2016 నవంబర్ 25న రూ.3,000 చెల్లించి ఒక మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నారు. త్వరలోనే తగిన సంబంధం చూపిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. అయితే, సంవత్సరాలు గడుస్తున్నా ‘‘ఈసారి మంచి సంబంధం వస్తుంది’’ అంటూ హామీలు ఇచ్చింది కానీ వధువును వెతకడంతో విఫలమైంది. 9 ఏళ్లుగా ఒక్క సంబంధాన్ని చూపించలేకపోయింది.
తన పెళ్లి కోసం వృద్ధులైన తల్లిదండ్రులు ఎంతో కాలం ఎదురుచూశారని సదరు బాధిత ప్రొఫెసర్ కన్జ్యూమర్ ఫోరమ్‌లో తన వాదన వినిపించాడు. 2025లో తన తండ్రి క్యాన్సర్‌తో మరణించాడని, తల్లి కూడా అనారోగ్యంతో ఉందని చెప్పాడు. మ్యారేజ్ బ్యూరో సరైన సమయానికి తన బాధ్యత నిర్వర్తించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని చెప్పాడు.
ఫిర్యాదు విచారణకు వచ్చినప్పటికీ మ్యారేజ్ బ్యూరో తరుఫున ఎవరూ హాజరుకాలేదు. ఎలాంటి వివరణ కూడా సమర్పించలేదు. ప్రొఫెసర్ సమర్పించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫీజు చెల్లించిన ఆధారాలును ఫోరమ్ పరిశీలించింది. కమిషన్ మ్యారేజ్ బ్యూరోకు రూ. 3000 రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించాలని, మానసిక వేదనకు రూ. 3000 పరిహారం ఇవ్వాలని, కోర్టు ఖర్చుల కింద రూ. 2000 ఇవ్వాలని, ఈ మొత్తాన్ని 30రోజుల్లో చెల్లించాలని, గడువులోగా చెల్లించకపోతే రీఫండ్ మొత్తంపై వార్షిక 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?