Karnataka Woman Face Disfigured During Makeup Groom Calls Off Wedding: సాధారణంగా పెళ్లి వేడుకలకు వచ్చే అతిథులే ఎంతో అందంగా ముస్తాబైవస్తారు. అలాంటప్పుడు.. పెళ్లికూతురు అందరిలోనూ ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. ఆ కోరికతోనే ఓ వధువు బ్యూటీపార్లర్‌కి వెళ్లింది. తనని అందమే అసూయపడేంత అందంగా, తనకు కాబోయే భర్త చూడగానే ఫిదా అయ్యేలా తయారు చేయాలని కోరింది. పాపం ఆ నవ వధువు, అలా కోరిందో లేదో, క్షణాల్లోనే ఆమె ఆశలు ఆవిరైపోయాయి. మేకప్ తేడా కొట్టడంతో.. ఆమె ముఖం చెడిపోయింది. దీంతో.. ఆమె పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Kishan Reddy: కుటుంబ పార్టీల కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటుపడుతోంది
కర్నాటకలోని హసన్ జిల్లా అరసికెరె గ్రామానికి చెందిన ఓ యువతికి కొన్ని రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించారు. త్వరలోనే పెళ్లి కావడంతో.. నవ వధువు అందంగా ముస్తాబవ్వడం కోసం స్థానికంగా ఉన్న బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. తొలుత ఫేషియల్ చేసుకుంది. అనంతరం ఆవిరి పడుతున్న సమయంలో.. పొరపాటు జరిగిపోయింది. వేడి కారణంగా ఆమె ముఖం వాడిపోయింది. దీంతో అందంగా ఉన్న ఆమె.. అందవిహీనంగా తయారైంది. ముఖం నల్లగా మారిపోయి, వాచింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందుతోంది.
Crime News: ఫామ్‌హౌస్‌లో మహిళ దారుణహత్య.. కత్తితో పొడిచి చంపిన దుండగులు
ఈ విషయం గురించి తెలుసుకున్న వరుడు.. ఆమెను చూసేందుకు ఆసుపత్రి వెళ్లాడు. అక్కడ ఆమె ముఖం చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ముఖం మాత్రం వాచిపోవడంతో, తనకు ఆ అమ్మాయి వద్దని నిరాకరించాడు. పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో.. వధువు కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. ఈ క్రమంలోనే వారు ఈ ఘటనకు కారణమైన బ్యూటీ పార్లర్ యజమాని గంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. పెళ్లి ఆగిపోవడంతో వధువు కుటుంబం నిరాశలో మునిగింది.