Kangana Ranaut: వ్యవసాయ చట్టాలపై కంగనా కామెంట్స్.. పంజాబ్‌లో బీజేపీ ప్రతిష్టకు నష్టం..!
- వ్యవసాయ చట్టాలపై తిరిగి తీసుకురావాలన్న ఎంపీ కంగనా రనౌత్..
- కంగనా వ్యాఖ్యలతో పంజాబ్ లో బీజేపీకి తీవ్ర స్థాయిలో నష్టం..
- మండి ఎంపీ వ్యాఖ్యలు పంజాబ్ రైతులందరి మనోభావాలను దెబ్బ తీస్తుంది: జైవీర్ షెర్గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీంతో ఈ చట్టాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ఈ చట్టాలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మూడు చట్టాలను తిరిగి తీసుకురావాలని సూచించడంతో తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఆమె వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉండటంతో నిన్న క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయాలు.. పార్టీది కాదని తెలిపారు. అయితే, కమలం పార్టీ ఎంపీ కంగనా క్షమాపణలు చెప్పినప్పటికీ పంజాబ్‌లో బీజేపీ ప్రతిష్టకు కలిగించిన నష్టాన్ని తగ్గించలేకపోయాయి.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఇక, పంజాబ్‌తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు వ్యక్తిగతం పార్టీకి సంబంధించినది కాదని తెలిపారు. కానీ ఒక పంజాబీలపై సిక్కు సమాజంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఈలాంటి కామెంట్స్ వల్ల పంజాబ్ రైతులందరి మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని అన్నారు. పంజాబీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ చేసిన మంచి మొత్తం పోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ పేర్కొన్నారు. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన కంగనా రనౌత్.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకు రావాలని తెలిపింది.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!