Kangana Ranaut: బడ్జెట్ తయారు చేస్తున్న సమయంలో హల్వా వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారు లేరని ఇటీవల లోక్‌సభలో రాహుల్ గాంధీ ‘దేశ్ కా హల్వా’ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటు గానే స్పందించింది. కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ తయారీ సమయంలో ఎంతమందికి చోటిచ్చారని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ గురించి నేనేం చెప్పాలి, ఆయన చెప్పే దాంట్లో అర్థం లేదని, ఆయన చెప్పేది అర్థం కావడం లేదని, ఆయన మాట్లాడిన మాటలు ఖండిచాల్సిన విషయమని అన్నారు. రాహుల్ గాంధీ నానమ్మ( మాజీ ప్రధాని ఇందిరా గాంధీ) పలుమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
Read Also: Uttar Pradesh: సజీవంగా వ్యక్తి సమాధి.. వీధి కుక్కలు రక్షించాయి..
రాహుల్ గాంధీ తీరు దేశానికి మంచిది కాదని, తమకు లబ్ధి చేకూరడానికి దేశాన్ని ముక్కలు చేయాలనేది కాంగ్రెస్ మనస్తత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి కొనసాగుతోందని మండిపడ్డారు. జూలై 29న, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర బడ్జెట్ తయారీ సమయంలో జరిగిన హల్వా వేడుకల ఫోటోల్ని ప్రదర్శించారు. ఇందులో దళితులు ఆదివాసీలు, వెనకబడిన తరగతులకు చెందిన వ్యక్తి లేరని అన్నారు. బడ్జెట్ తయారీలో 20 మంది అధికారులు పనిచేస్తే ఇందులో కేవలం ఒక్క మైనారిటీ వ్యక్తి, ఒక ఓబీసీ వ్యక్తి ఉన్నారని అన్నారు.