కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని కమల్ ట్వీట్ చేశారు. అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలని… తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Read Also: రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఇకపై జాతీయ ప్రాజెక్టులో 60 శాతం నిధులే
కాగా కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ కాలేజీలో ప్రారంభమైన హిజాబ్ వివాదం నెమ్మదిగా చిక్ మంగుళూరు, బెళగావి, కొప్పెల, మాండ్య జిల్లాలకు సైతం పాకింది. దీంతో ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకోవడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. పలుచోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. తాజా పరిణామాలతో ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించింది.
கர்நாடகாவில் நடப்பது கலக்கத்தைத் தூண்டுகிறது. கள்ளமில்லா மாணவர்கள் மத்தியில் மதவாத விஷச் சுவர் எழுப்பப்படுகிறது. ஒற்றைச் சுவர் தாண்டியிருக்கும் பக்கத்து மாநிலத்தில் நடப்பது தமிழ்நாட்டுக்கும் வந்துவிடக் கூடாது. முற்போக்கு சக்திகள் மேலும் கவனமாக இருக்க வேண்டிய காலம் இது.
— Kamal Haasan (@ikamalhaasan) February 9, 2022