India- Canada Row: మా దగ్గర సాక్ష్యాలు లేవు.. ఒప్పుకున్న కెనడా పీఎం.. ఇండియా బిగ్ విన్..
- భారత్‌కి వ్యతిరేకంగా మా వద్ద సాక్ష్యాలు లేవు..
- కేవలం ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ మాత్రమే ఉన్నాయి..
- ఎట్టకేలకు ఒప్పుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో..
- భారత్-కెనడా సంబంధాలు దెబ్బతినడానికి ట్రూడోనే బాధ్యత వహించాలి..
- ఘాటుగా స్పందించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య చిచ్చుపెట్టింది. గతేడాది నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజాగా కెనడా ప్రభుత్వం ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని, ముఖ్యంగా భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు మరికొందరు ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా భారత్ ఫైర్ అయింది. కెనడాలోని భారత రాయబారుల్ని ఉపసంహరించుకుంది. ఇండియాలో కెనడా రాయబారుల్ని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. గతేడాది నిజ్జర్ హత్య తర్వాత కెనడా పీఎం జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ, భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని చెప్పాడు. అయితే, దీనికి సాక్ష్యాలు సమర్పించాలని అప్పటి నుంచి భారత ప్రభుత్వం అడుగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే, తాజాగా తమ వద్ద సాక్ష్యాలు లేవని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకరించాడు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఉన్నాయి తప్పితే, బలమైన సాక్ష్యాలు లేవని అన్నారు. ‘‘కెనడాతో పాటు ఫైవ్ ఐస్ మిత్రదేశాల నుంచి ఇంటెలిజెన్స్ ఉందని, ఇందులో భారత ప్రమేయం ఉందని స్పష్టంగా ఉంది. కెనడియన్ గడ్డపై కెనడియన్‌ని చంపేశారు’’ అన్నాడు.కెనడా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లతో కూడిన ఫైవ్ ఐస్ నెట్‌వర్క్ నిఘా మరియు సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ (SIGINT)పై దృష్టి పెడుతుంది.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే కెనడియన్ల సమాచారాన్ని సేకరించే పనిలో భారత దౌత్యవేత్తలు ఉన్నారని, ఈ డేటాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి పంపించారని, బిష్ణోయ్‌తో పాటు భారత సీనియర్ అధికారులు, నేరసంస్థలకు పంపినట్లు ట్రూడో ఆరోపించాడు. 2023 బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా వెలుపల నిజ్జర్‌ని కాల్చి చంపారు. ఈ హత్యలో ఆరుగురు భారత దౌత్యవేత్తలకు సంబంధం ఉందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆరోపించింది. అయితే, జస్టిన్ ట్రూడో ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఖలిస్తానీ సిక్కుల ఓట్లు పొందేందుకు ఈ తరహాలో భారత్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
భారత్‌కి పెద్ద విజయం:
గతేడాది కాలంగా కెనడా నుంచి భారత్ సాక్ష్యాలను కోరుతోంది. కెనడా ఈ సాక్ష్యాలను ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని భారత్ పలుమార్లు ఆ దేశం దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా కెనడా ప్రధాని ఇలా సాక్ష్యాలు లేవని ఒప్పుకోవడం భారత్‌కి ఘన విజయమని చెప్పవచ్చు. కెనడియన్ జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్‌మాన్ మాట్లాడుతూ.. ఇది భారతీయ కథనానికి ఒక పెద్ద విజయమని అభివర్ణించాడు.
దీనిపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది. తాము గత ఏడాది కాలంగా ఇదే విషయాన్ని చెబుతున్నట్లు పేర్కొంది. ‘‘ఈ రోజు కెనడా పీఎం చెప్పిన విషయాన్ని, మేము నిరంతరంగా చెబుతూనే ఉన్నాము. కెనడా భారత్ మరియు భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించలేదు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కెనడా-భారత్ మధ్య దౌత్యవివాదానికి పీఎం ట్రూడోనే బాధ్యత వహించాలని చెప్పింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!