India- Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య చిచ్చుపెట్టింది. గతేడాది నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజాగా కెనడా ప్రభుత్వం ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని, ముఖ్యంగా భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు మరికొందరు ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించింది.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన తర్వాత భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా భారత్ నుంచి సహకరించాలని కెనడా విజ్ఞప్తి చేస్తోంది. అదే సమయంలో తమ్ముడికి సాయం చేసేందుకు భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా ప్రకటనలు చేస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ వివాదం నుంచి ఎవరు ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి.