కరోనాపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ఊపందుకుంది.. ఒకప్పుడు రోజుకు లక్షల్లో డోసులు వేసే స్థాయి నుంచి ఇప్పుడు ఒకేరోజులో రెండు కోట్లకుపైగా వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించింది భారత్.. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అర్హులైన జనాభా అంతటికీ కనీసం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించాలనే లక్ష్యం నెరవేరేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.…
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్‌తో ఒకే రోజు 13.72 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై సోషల్ మీడియా వేదికగా కోవిడ్ వారియర్లకు అభినందనలు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్‌పై ట్విట్టర్‌లో స్పందించిన ఏపీ సీఎం.. కోవిడ్ పై పోరులో ఒకే రోజు 13,72,481 వ్యాక్సిన్‌లు వేసి ఏపీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు… గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ డాక్టర్లు,…