Modi- Biden: ఈ నెల 21న ప్రధాని మోడీ- జో బైడెన్ కీలక భేటీ..
- అమెరికాలో కొనసాగుతున్న ఎన్నికల హీట్..
- ఈ నెల 21వ తేదీన డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో క్వాడ్ సమ్మిట్ ఏర్పాటు..
- భారత ప్రధాని నరేంద్ర మోడీతో అమెరిక అధ్యక్షుడు జో బైడెన్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi- Biden: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ కొనసాగుతుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు.. మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. వారిద్దరూ తమ ప్రచార కార్యక్రమాలు, డిబేట్లలో జోరు పెంచారు.
Read Also: Arekapudi Gandhi: ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి సవాల్.. పోలీసులు భారీ బందోబస్తు
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఈ పరిస్థితుల మధ్య అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ బైడెన్ మోడీకి ఆహ్వానం పంపించారు. దీనికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారత ప్రధాని అమెరికా పర్యటనపై నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. క్వాడ్ సభ్య దేశాల సమావేశానికి అమెరికా ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ నెల 21వ తేదీన డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్- పర్సన్ క్వాడ్ సమ్మిట్ ఈ ఏడాది విల్మింగ్టన్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్య దేశాలుగా ఉన్నాయి. జో బైడెన్, మోడీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్‌కు హాజరు కాబోతున్నారు. 2021లో వైట్‌హౌస్‌లో మొట్ట మొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ సమావేశం ఏర్పాటవుతూ వస్తుంది.
Read Also: Madrassas: విద్యాబోధనకు మదర్సాలు పనికిరావు..
ఇక, ఈ మధ్యకాలంలో క్వాడ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఎనిమిది సార్లు భేటీ అయ్యారు. సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ లాంటి అంశాలపై ఈ సమ్మిట్ లో ప్రధానంగా చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!