కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.. ఓవైపు, ఎస్పీ, బీఎస్పీలు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. ఇక, యూపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ప్రియాంకాగాంధీ.. అయితే, యూపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత.. గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు… రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాద్.. 2019లో పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది.. కానీ, అప్పట్లో ప్రియాంకాగాంధీ నచ్చజెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు.. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్‌బై చెప్పి గట్టి షాక్ ఇచ్చారు..
ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జితిన్ ప్రసాద్.. బీజేపీ మాత్రమే నిజమైన రాజకీయ పార్టీ.. ఇది ఏకైక జాతీయ పార్టీ.. మిగిలిన పార్టీలు అన్నీ ప్రాంతీయ పార్టీలని కామెంట్ చేశారు.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోగలరన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.. దాంతో.. ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా చర్చించాల్సి వచ్చిందన్నారు.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ.. ప్రజల తరఫున నిలబడుతోంది.. అందుకే తాను బీజేపీలో చేరినట్టు చెప్పుకొచ్చారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు సహాయం చేయలేకపోతే పార్టీగా ఉండటంలో అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు.