Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి
- కేంద్రమంత్రికి తప్పిన ప్రమాదం
- ఇద్దరు అనుమానిత యువకులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని గయా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీపై ఆకస్మికంగా రాళ్ల దాడి జరిగింది. అయితే అనూహ్యంగా కేంద్రమంత్రి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ రాయి మాత్రం ఆయన వెనుక ఉన్న అంగరక్షకుడికి తగలడంతో గాయపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఇద్దరు అనుమానాస్పద యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం బీహార్‌లోని గయా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ పాల్గొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వేదికపై నుంచి లేవగానే రాళ్ల దాడి జరిగింది. అయితే రాయి నేరుగా మంత్రికి తగలకపోవడంతో ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారు. అయితే ఆయన వెనుక ఉన్న అంగరక్షకుడికి మాత్రం గాయాలయ్యాయి. ఖిజ్రసరాయ్ బ్లాక్‌లోని సిస్వార్ గ్రామంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలంలోని పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఖిజ్రసరాయ్ పోలీస్ స్టేషన్ తక్షణమే చర్యలు చేపట్టి సంఘటనా స్థలం నుంచి ఇద్దరు అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుంది. రాళ్ల దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటి, ఈ దాడి ముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందా లేక ఆకస్మికంగా జరిగిందా అనే విషయాలను నిర్ధారించడానికి ప్రస్తుతం వారిద్దరినీ విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి అంశంపై దర్యాప్తు జరుగుతోందని, ప్రత్యక్ష సాక్షులను కూడా ప్రశ్నిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?