Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..

  • పాకిస్తాన్‌లో పత్రికా స్వేచ్ఛ లేదు..
  • అమెరికా-ఇరాన్ ఒప్పంద వివరాలు ఆలస్యానికి ఇదే కారణం..
  • దాయాది పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
Jd Vance

Jd Vance

Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ) విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చాయి. ఎంఓయూ వివరాలు ఆలస్యంగా విడుదల కావడంపై మాట్లాడుతూ.. పాకిస్తాన్, ఖతార్ దేశాల్లో అమెరికా తరహా పత్రికా స్వేచ్చ లేదని అన్నారు. ‘ఇంట్రెస్టింగ్ టైమ్స్ విత్ రాస్ డౌథట్’ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన.. అమెరికా-ఇరాన్ ఒప్పందం పూర్తి వివరాలను వెంటనే విడుదల చేయాలని అనుకున్నామని, అయితే, మధ్యవర్తిత్వం చేస్తున్నా భాగస్వామ్య దేశాల వ్యవస్థల కారణంగా కొంత ఆలస్యం జరిగిందని ఆరోపించారు.

పాకిస్తాన్, ఖతార్ దేశాల్లో అమెరికా తరహా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్ లాంటి పత్రికా స్వేచ్చా హక్కులు లేవు. అక్కడ ప్రభుత్వ ఒప్పందాల వివరాలను ప్రజలు పరిశీలించడం ప్రశ్నించడం అనేవి పెద్దగా ఉండవు’’ అని వాన్స్ అన్నారు. అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛలను రక్షిస్తుందని,అయితే పాకిస్తాన్‌‌లో అలాంటి రాజ్యంగ పరిరక్షణలు పరిమితంగా ఉన్నాయని ఆయన అన్నారు.

×
×
Ad

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పాకిస్తాన్ దౌత్య విజయంగా ప్రచారం చేసుకుంది. అయితే, ఒప్పంద కార్యక్రమం జరిగే స్విట్జర్లాండ్‌కు పాకిస్తాన్ ప్రధాని షహజాజ్ షరీఫ్ ముందుగా వెళ్లాలని అనుకున్నా, ఆ తర్వాత ఏదో కారణాలతో రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరకు స్విట్జర్లాండ్ లో ఈ కార్యక్రమం జరగలేదు. ప్రస్తుతం పత్రికా స్వేచ్ఛలో పాకిస్తాన్ 180 దేశాల్లో 153వ స్థానంలో ఉంది.