Tawi Bridge: జమ్మూను ముంచెత్తిన భారీ వర్షాలు.. చూస్తుండగానే కూలిన తావి వంతెన.. షాకింగ్ వీడియో
- జమ్మూను ముంచెత్తిన భారీ వర్షాలు
- చూస్తుండగానే కూలిన తావి వంతెన
- షాకింగ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రికార్డ్ స్థాయిలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అన్ని వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక దోడాలోని భలీసా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కాలువలు పొంగిపొర్లాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: మోడీకి ఫోన్ చేసి బెదిరించా.. పాక్‌తో యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ అదే పాట
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
ఇక జమ్మూలోని భగవతి నగర్ దగ్గర తావి నది వంతెన కూలిపోయింది. తావి నది దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనను భారీ వరద కొట్టడంతో ఒక్కసారిగా బ్రిడ్జి ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వాహనాలు వంతెన కూలిపోయింది. వేగంగా వెళ్తున్న వాహనాలన్నీ కిందకి కూరుపోయాయి. అయితే చాకచక్యంగా ప్రయాణికులు తప్పించుకున్నారు. అయితే కొన్ని వాహనాలు కొట్టుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: UP: వరకట్న దాహానికి మరో అబల బలి.. భార్యను చంపిన కానిస్టేబుల్
ఇదిలా ఉంటే వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. అయినా కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. ఇక కాలువలు, నదులు, నల్లాలు పొంగి పొర్లుతున్నాయి. గాలి, వాన బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాలను భారత్ నిలిపివేసింది. అయితే తావి నదిలో వరదలు వచ్చే అవకాశం ఉందని భారతదేశం పాకిస్థాన్‌ను హెచ్చరించింది. వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల తర్వాతే వరదలు ముంచెత్తాయి. భారతదేశం అందించిన సమాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు ది న్యూస్ తెలిపింది.
As Tawi Bridge began to collapse after heavy rains battered Jammu, the timely intervention of local police and civilians helped save lives today. Kudos to them! The LG administration should recognize and reward them for their presence of mind. @OfficeOfLGJandK @JmuKmrPolice https://t.co/aXtUmF8WC5 pic.twitter.com/SLB51x1TIF
— Shesh Paul Vaid (@spvaid) August 26, 2025
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!