జమ్మూకాశ్మీర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రికార్డ్ స్థాయిలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అన్ని వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక దోడాలోని భలీసా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కాలువలు పొంగిపొర్లాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.