Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- ఉషా వాన్స్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
- శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన సెకండ్ లేడీ
- పట్టించుకోని సిబ్బంది.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉషా వాన్స్.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య. అంతేకాదు అమెరికా సెకండ్ లేడీ. అంత గుర్తింపు కలిగిన మహిళ. ఎంతో సెక్యూరిటీ మధ్య ఉంటారు. అలాంటిది ఆమెకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నవజాత శిశువు అలెక్ను బేబీ క్యారియర్‌లో ఎత్తుకుని హెలికాప్టర్ మెట్లు దిగుతుండగా ఒక్కసారిగా కాలుజారి పడబోయారు. అయితే వెంటనే తేరుకుని రైలింగ్‌ను పట్టుకుని బ్యాలెన్స్ చేసుకున్నారు. అనంతరం శిశువు వీపుపై చేయి వేసి ధైర్యపరిచి చిరునవ్వుతో ముందుకు సాగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ దగ్గర సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
అమెరికాలో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జేడీ వాన్స్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం కోసం అలాస్కాకు వెళ్లారు. 7.5 గంటల ప్రయాణం కోసం తొమ్మిది వారాల కుమారుడైన అలెక్ నీల్ వాన్స్‌ను తీసుకెళ్లారు. అయితే ఉషా వాన్స్ హెలికాప్టర్ దిగుతుండగా మెట్ల చివరి భాగంలో అడుగు సరిగ్గా వేయలేకపోయారు. దీంతో ఒక్కసారిగా తడబడడంతో రైలింగ్ పట్టుకుని బ్యాలెన్స్ చేసుకున్నారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో సిబ్బంది అక్కడే ఉన్న ఒక్కరు కూడా స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉషా వాన్స్ తడబడిన సమయంలో సమీపంలో ఉన్న సిబ్బంది వెంటనే ఎందుకు సహాయం చేయలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.
జూలైలో జన్మించిన అలెక్
ఉషా, జేడీ వాన్స్ దంపతులకు అలెక్ జూలై 19న మేరీల్యాండ్‌లోని బెథెస్డాలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో జన్మించాడు. అలెక్ వారి నాలుగో సంతానం. అతనికి తోబుట్టువులుగా ఇవాన్ (9), వివేక్ (6), మిరాబెల్ (4) ఉన్నారు.
Usha Vance nearly crushed her new baby. Glad he’s ok. https://t.co/QjLSacMYXz
— Brian Krassenstein (@krassenstein) October 5, 2026
- Tags
- JD Vance
- us
- Usha Vance
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!