Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం సహజమే. కానీ, హీరోయిన్ గ్లామర్ తగ్గకుండానే తల్లి పాత్రలు ఒప్పుకోవడంపై ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు, దానికి సీనియర్ నటి ఇంద్రజ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’ సక్సెస్ మీట్లో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ హీరోయిన్ ఇంద్రజపై ప్రత్యేకమైన ప్రశంసలు కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలానే ఒక సందర్భంలో ఆమె గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. లగడపాటి మాట్లాడుతూ.. “ఈ సినిమాకి అసలైన బిగ్గెస్ట్ స్టార్ ఇంద్రజ. తెలుగు తెరపై జయసుధ తర్వాత అంతటి హుందాతనం, పవిత్రత ఉన్న నటి ఇంద్రజ.
అయితే ఆమె ఇప్పటికీ హీరోయిన్‌లాగే మెరిసిపోతున్నారు. అలాంటి అందం ఉన్న నటి ఇలా తల్లి పాత్రలు చేయడం నిజంగా చెప్పాలంటే చాలా ‘అన్ఫార్చునేట్’. ఈ తరం కుర్రాళ్లకు తల్లిగా కనిపించడం కంటే ఇంకా లీడ్ రోల్స్ చేయగల సత్తా ఆమెకుంది. అయితే కథపై, కళపై ఉన్న గౌరవంతో ఈగోలను పక్కనపెట్టి దర్శకుడు త్రినాథరావు పక్కన నటించడానికి ఆమె ఒప్పుకున్నారు. ఒకవేళ ఆమె అంగీకరిస్తే భవిష్యత్తులో సౌత్ ఇండియన్ స్క్రీన్‌పై జయసుధ తర్వాత బెస్ట్ మదర్ రోల్స్ ఆమెకే దక్కుతాయి” అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, గతంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇంద్రజ తన వృద్ధ తండ్రిని ఓ పసిపాపలా చూసుకున్న తీరును గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. నేటి సమాజంలో వృద్ధ తల్లిదండ్రులను భారంగా భావించే రోజుల్లో ఆమె చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు.
Also Read
- Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతుండగానే కల్పించుకున్న ఇంద్రజ, మైక్ అందుకుని తనదైన శైలిలో ధీటుగా బదులిచ్చారు. “హీరోయిన్గా ఎన్నో ఏళ్ళు చేశాను.. కానీ హీరోయిన్గా చేసిన దానికంటే అమ్మ పాత్రలు చేయడమే నాకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తోంది. బయట ప్రపంచంలో నన్ను చూసిన వారంతా ఎంతో ఆప్యాయంగా ‘అమ్మా’ అని పిలుస్తుంటే కలిగే గౌరవం ఎంతమందికి దక్కుతుంది? ఆ పిలుపు ఒక వరం. ఒకవేళ నా లుక్స్ ఇంకా హీరోయిన్‌లాగే ఉండి తల్లి పాత్రలకు అడ్డంకి అనుకుంటే.. నా లుక్స్‌ను మరింత డల్ చేసుకోవడానికైనా నేను సిద్ధమే కానీ, మంచి మంచి క్యారెక్టర్ రోల్స్ చేయడం మాత్రం ఆపను” అంటూ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!