HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన కొనసాగుతోంది.. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించిన భారత నౌకాదళ తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (FSS-1) ‘సూర్య’ జలప్రవేశం చేసింది.. రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాలకు ఇది కీలక ముందడుగుగా నిలిచింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. నౌకల నిర్మాణంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ సామర్థ్యాలు భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశ రక్షణ రంగంలో HSL కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జల ఉష నౌకల తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల నిర్మాణం వరకు హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రయాణం గొప్పదని ప్రశంసించారు.
హిందుస్థాన్ షిప్‌యార్డ్ సముద్ర రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో భాగస్వామిగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. నావల్ డాక్‌యార్డ్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ వంటి సంస్థలు నౌకల నిర్మాణం, నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్నాయని, వాటి ద్వారా MSME పరిశ్రమలకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. HSLలో నిర్మిస్తున్న ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు 43,500 టన్నుల సామర్థ్యంతో ఉంటాయి. సముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నౌకాదళ నౌకలకు అవసరమైన సరఫరాలను అందించడం ద్వారా వాటి సుదీర్ఘ సముద్ర ప్రయాణాలకు ఇవి తోడ్పడనున్నాయి. FSS-1 స్టీల్ కటింగ్ జరిగిన 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశించడం దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యానికి నిదర్శనంగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Also Read
- Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
- Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
- Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
- UP Elections: హిందూ ఓటర్లపై ఎస్పీ గురి.. ఎట్టకేలకు అయోధ్యకు అఖిలేష్.!
అదే కార్యక్రమంలో ఫ్లీట్ సపోర్ట్ షిప్-5కు కీల్ వేయడంతో పాటు HSLలో అప్‌గ్రేడ్ చేసిన స్లిప్‌వే-4, 300 టన్నుల గోలియత్ క్రేన్‌ను కూడా ప్రారంభించారు. ఈ మౌలిక వసతుల ద్వారా 45,000 డెడ్‌వెయిట్ టన్నుల వరకు సామర్థ్యం కలిగిన పెద్ద, సంక్లిష్ట నౌకలను నిర్మించి జలప్రవేశం చేయించే సామర్థ్యం HSLకు పెరగనుంది. దేశ రక్షణతో పాటు ప్రపంచ సముద్ర జలాల పరిరక్షణలో అంతర్జాతీయ సముద్ర నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో కేవలం నౌకల నిర్మాణం మాత్రమే జరగడం లేదని, ఇది దేశ రక్షణ రంగ బలాన్ని పెంచే మార్గంగా మారుతోందని అన్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో దేశీయంగా రక్షణ పరికరాలు, నౌకల తయారీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో భారత్‌పై నమ్మకం మరింత పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో మారిటైమ్ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహకారం బాగుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రక్షణ, నౌకా నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..
తాజావార్తలు
-
Bharat Summit 2026: నేటి నుంచే భాగ్యనగరంలో ‘భారత్ సమ్మిట్’.. 70కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు..
-
Xi Jinping Warns Taiwan: తైవాన్‌కు జిన్‌పింగ్ వార్నింగ్.. స్వాతంత్ర్యానికి అవకాశమే లేదు.. చైనాతో ఏకీకరణ తప్పదు!
-
Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
-
IPL 2027-KKR: కేకేఆర్‌లో భారీ మార్పులు.. రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
-
India vs New Zealand: నేడే నాలుగో వన్డే.. శ్రేయస్‌కు కెప్టెన్ పగ్గాలు.. టాస్, ఫ్రీ లైవ్ టెలికాస్ట్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!