PM Modi: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని శుక్రవారం హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవని, రాష్ట్రహోదా పొందుతుందని, మీరు మీ కలలను మీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పంచుకోగలుగుతారని అన్నారు.
Read Also: BRS: కడియంకు చెక్ పెట్టేందుకేనా?.. వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య!
Also Read
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం, దాడులు, రాళ్ల దాడులు, సరిహద్దుల కాల్పులు వంటి భయాలు లేకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ‘‘దయచేసి నన్ను నమ్మంది. గత 60 ఏళ్లుగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్న సమస్యల నుంచి మీరు విముక్తి పొందుతారు. గత 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా రూపాంతం చెందిందని, నేను నా వాగ్దానాన్ని నెరవేర్చాను’’ అని ఆయన అన్నారు. కాశ్మీర్ ప్రజలు దీర్ఘకాలిక బాధలకు ముగింపు పలుకుతానన్ తన వాగ్దానాన్ని నెరవేర్చానని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ఆరోపించారు.
ఉదంపూర్ నుంచి జీతేంద్ర సింగ్, జమ్మూ నుంచి జుగల్ కిషోర్‌లకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రధాని మోడీ కోరారు. ‘‘అధికారం కోసం వారు జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 గోడని నిర్మించారు. మీ ఆశీర్వాదంతో మోడీ ఆ గోడల్ని కూల్చివేసి, ఆర్టికల్ 370 చెత్తను భూమిలో పాతిపెట్టారు’’ అని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
తాజావార్తలు
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!