Jaishankar: పాకిస్తాన్ ‘‘బ్రోకర్ దేశం’’, మనం కాదు.. విపక్షాలకు ఇచ్చిపడేసిన జైశంకర్..
- పాకిస్తాన్ ‘‘బ్రోకర్ దేశం’’, మనం కాదు..
- ఇరాన్ యుద్ధం ఆపేందుకు పాక్ మధ్యవర్తిత్వం..
- ఆల్ పార్టీ మీట్‌లో ఇచ్చిపడేసిన జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ఈరోజు(బుధవారం) ఢిల్లీలో ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఇరాన్ యుద్ధం సమయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, చమురు సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు తెలియజేసింది. అయితే, ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ‘‘దళాల్ దేశం’’ కాదని స్పష్టం చేశారు. పాక్ మధ్యవర్తిత్వం గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించిన తర్వాత, ఈ విమర్శలకు జైశంకర్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. పాకిస్తాన్‌ను ‘‘బ్రోకర్ దేశం’’గా అభివర్ణిస్తూ.. భారతదేశం ఎవరి మధ్య మధ్యవర్తిత్వం చేయదని చెప్పారు. భారత్ తన దేశ అవసరాలను మాత్రమే పట్టించుకుంటుందని ప్రభుత్వం సూటిగా చెప్పింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్-యూఎస్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ మధ్యవర్తిత్వం చేస్తుందనే వార్తలు వెలువడిన తర్వాత మోడీ సర్కార్‌పై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. జైరాం రమేష్ వంటి వారు పాక్ మధ్యవర్తిత్వం చేస్తుంది, ఇండియా ఆ పని కూడా చేయలేకపోతుందని ఎద్దేవా చేశారు. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన వహించారు. ఇందులో హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి పాల్గొన్నారు. ప్రతిపక్షాలైన బీజేడీ నుంచి సస్మిత్ పాత్రా, జేడీయూ నుంచి లల్లన్ సింగ్, కాంగ్రెస్ నాయకులు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ హాజరయ్యారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!