భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఒకసారి ఇలా చెప్పగా.. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశం సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను తోసిపుచ్చారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అమెరికా జోక్యం లేదని.. హాట్‌లైన్ ద్వారా ఇరు దేశాలు కాల్పుల విరమణపై చర్చించి విరమించినట్లు తెలిపారు. ఇందులో ట్రంప్ జోక్యం ఏ మాత్రం లేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Future Forward : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, IBM సంయుక్తంగా “Future Forward” అకడమిక్ ప్రోగ్రామ్ ప్రారంభం
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల తర్వాత జైశంకర్ తొలిసారి నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్ఓఎస్ రిపోర్టర్ సాండర్ వాన్ హూర్న్కు జై శంకర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో మతం పేరుతో 26 మందిని చంపేశారని.. ఇది చాలా క్రూరమైన ఉగ్ర దాడి అన్నారు. అంతేకాకుండా పర్యాటక రంగానికి హాని కలిగించడమే కాకుండా మతపరమైన విభేదాలు సృష్టించడానికేనన్నారు. మే 7-10 మధ్య ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు అనేక దేశాలు భారతదేశంతో సంప్రదింపులు జరిపాయని.. అలాగే అమెరికా కూడా సంప్రదించిందని పేర్కొన్నారు. చివరికి ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగినట్లు జై శంకర్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Jagan Mohan Reddy: అభివృద్ధి ఎక్కడ కనిపించనేలేదు.. సంక్షేమం ఊసే లేదు..!
ఏప్రిల్ 22న పహల్గామ్లో మతం పేరుతో 26 మంది హిందువులను ఉగ్రవాదులు చంపేశారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. కానీ ట్రంప్ మాత్రం తన వల్లే కాల్పుల విరమణ జరిగిందని చెప్పుకుంటున్నారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.