India-US Deal: భారత రైతులకు భద్రత, వెనిజులా నుంచి చమురు.. భారత్-యూఎస్ డీల్..
- భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం..
- భారత రైతుల ప్రయోజనాలకే పెద్ద పీట..
- వెనిజులా సహా, ఆంక్షలు లేని దేశాల నుంచి చమురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US Deal: భారత్-అమెరికా మధ్య ప్రతిష్టాత్మక ట్రేడ్ డీల్ ఓకే అయింది. భారత్‌పై ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇదిలా ఉంటే, భారత రైతులు ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించలేదని ట్రేడ్ డీల్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆంక్షలు లేని’’ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే రెండో అతిపెద్ద దేశంగా ఉంది, అయితే, ఇప్పుడు రష్యా అమెరికా ఆంక్షల కింద ఉంది. దీంతో భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయమని పరోక్షంగా చెప్పినట్లు అయింది.
Read Also: T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
భారతదేశంలోని వ్యవసాయం రంగంలోకి తలుపులు తెరవాలని అమెరికా కోరింది. అయితే, దేశంలో ఇప్పటికీ అనేక మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉండటంతో సున్నితమైన ఈ రంగాన్ని కాపాడాలని మోడీ ప్రభుత్వం అనుకుంది. దీంతోనే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడింది. సోయాబీన్, పాడి పరిశ్రమ వంటి వ్యవసాయ రంగాలను అమెరికాను భారత్ అనుమతించలేదు.
మరోవైపు, ఆంక్షలు లేని దేశాల నుంచి చమురు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వెనిజులా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వెనిజులాపై యూఎస్ ఆంక్షలు ఉన్న సమయంలో ఆ దేశం నుంచి భారత్ చమురు కొనుగోలు చేయలేదు. మూడు రోజుల క్రితం, ట్రంప్.. భారత్ ఇరాన్‌కు బదులుగా వెనిజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని సూచించారు. 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని విస్తరించాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
-
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
-
South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
-
Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?