భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణలో తమ పాత్ర కూడా ఉందంటూ చైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా ట్రంప్ పదే పదే తానే ఆపానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా చైనా చేరింది.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఒకసారి ఇలా చెప్పగా.. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశం సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు.