Gurpatwant Singh Pannun: కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బతికే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్‌గా ఉన్న ఇతను నిత్యం భారతదేశంపై విషం చిమ్ముతూనే ఉన్నాడు.
Interpol Sent Back India's Request For Notice Against Khalistan Separatist: ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై భారత్ చేసిన అభ్యర్థనను ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‌పోల్) తిప్పిపంపింది. పన్నూపై ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ కోసం భారతదేశం అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను ఇంటర్‌పోల్ తిప్పిపంపినట్లు తెలుస్తోంది. సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఇన్‌పుట్‌లను సమర్పించింది. అయితే ఇంటర్‌పోల్ ప్రశ్నలను లేవనెత్తింది.