దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు బీభత్సమైన రీతిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది. Read…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతోందని వార్తలు వస్తున్నాయి. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు. భారత్‌పై ఈ వేరియంట్ ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై అధికారులతో మోదీ చర్చించారు. Read…
కరోనా మహమ్మారి ప్రభావం అంతర్జాతీయ ప్రయాణలపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో.. అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. నవంబర్ 30వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగించినట్టు… డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అయితే, ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలు, డీజీసీఏ ఆమోదించిన ప్రత్యేక విమానాలకు వర్తించదని తెలిపింది. కరోనా మహమ్మారితో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. గతంలో ఈ నిషేధాన్ని ఈ నెల…