దేశంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు బీభత్సమైన రీతిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది. Read…