IndiGo: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరిగిన ఇండిగో టికెట్ ధరలు..
- ప్రయాణికులకు ఇండిగో షాక్..
- టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్‌చార్జ్’’..
- పెరుగనున్న టికెట్ ధరలు..
- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo: మధ్యప్రాచ్యంలోని ఇరాన్ యుద్ధ ప్రభావం దేశ విమానయాన రంగంపై పడింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో, టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్‌చార్జ్’’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు మార్చి 14 అర్థరాత్రి 12 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ తెలిపింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తన టికెట్లపై అదనపు ఫ్యూయర్ సర్‌ఛార్జ్ విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ విడుదల చేసిన జెట్ ఫ్యూయల్ మానిటర్ ప్రకారం.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో విమాన ఇంధన ధరలు 85 శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. విమానయాన సంస్థల మొత్తం వ్యయాల్లో ఏటీఎఫ్ భాగమే ఎక్కువ కావడంతో, ఈ పెరుగుదల కంపెనీలపై పెను భారాన్ని చూపుతుంది. ప్రస్తుతం, ఇండిగో టికెట్ పై ప్రతీ ప్రయాణికుడు అదనపు ఫ్యూయల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
Read Also: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?
కొత్త బుకింగ్స్‌పై ప్రతీ ప్రయాణికుడు సెక్టార్ల వారీగా అదనపు ఫ్యూయల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో దేశీయ విమానాలకు రూ. 425, ఇండిన్ సబ్ కాంటినెంట్ రూ. 425, మిడిల్ ఈస్ట్ రూ. 900, దక్షిణాసియా మరియు చైనా రూ. 1800, ఆఫ్రికా మరియు వెస్ట్ ఆసియా రూ. 1800, యూరప్ రూ. 2300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇంధన ధరల పెరుగుదల వల్ల టికెట్ ధరలను భారీగా పెంచాల్సి వస్తుందని, అయితే ప్రయాణికులపై అధిక భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఫ్యూయల్ సర్‌చార్జ్ విధించామని ఇండిగో తెలిపింది. అదనపు ఛార్జీల వల్ల ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతూ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మార్పులు చేస్తామని సంస్థ ప్రకటించింది.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!