BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS Summit 2026: బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ భద్రతా, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఢిల్లీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దాదాపు 5 వేల మంది ట్రాఫిక్ పోలీసులు, 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. 35కి పైగా ప్రధాన రహదారులు, 22 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయనున్నారు. బ్రిక్స్ సమావేశాలు భారత మండపంలో జరగనున్నప్పటికీ, నోయిడా, సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, ద్వారక, దౌలా కువాన్ తదితర ప్రాంతాల్లో భారీగా ఆంక్షలు విధించారు. బ్రిక్స్ అతిథుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ కార్యాచరణ రూపొందించారు. విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎయిర్‌పోర్టులకు వెళ్లేందుకు మెట్రోను వినియోగించాలని పోలీసులు సూచించారు. విమాన ప్రయాణికులు మూడు, నాలుగు గంటల ముందుగానే విమానాశ్రయాలకు చేరుకునేలా ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు.
ఢిల్లీలో గగనతలంపై మూడు రోజుల ఆంక్షలు
బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ గగనతలంపై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించారు. నేటి ఉదయం 7 గంటల నుంచి సెప్టెంబర్ 13 ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇవి కొనసాగనున్నాయి. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలోని అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నియంత్రణలు ఉంటాయి. ముందుగా నిర్ధారించిన సమయాలకు భిన్నంగా అన్షెడ్యూల్డ్ విమానాలను నడపడం నిషేధం. అయితే షెడ్యూల్డ్ విమానాలకు అనుమతి ఉంటుంది. ఇందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. భారత వైమానిక దళం, సరిహద్దు భద్రతా దళాలు, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌కు ఈ ఆంక్షలు వర్తించవు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రయాణించే రాష్ట్ర ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లకు కూడా అనుమతి ఉంటుంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత ప్రతి విమానం FL290 అంటే 29,000 అడుగుల ఎత్తుకు చేరుకోవాలి. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోకి రాగానే ల్యాండింగ్ కోసం ఆ ఎత్తు నుంచి దిగడం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు పౌర విమానాల రాకపోకలకు సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం మూసివేయనున్నారు. రక్షణ దళాలకు మాత్రమే అక్కడ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆంక్షలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలతో నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) జారీ చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!