Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Magic Rice: అన్నం వండాలంటే ముందుగా బియ్యాన్ని కడిగి, గ్యాస్ వెలిగించి, అది ఉడికే వరకు వేచి చూడాలి. నీళ్లు మరగబెట్టడం, రైస్ కుక్కులో వడటం ఇవన్నీ మనం రోజూ చూసే తంతే. అయితే గ్యాస్ స్టవ్ వెలిగించకుండా, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకుండా, అసలు నిప్పుతో పనే లేకుండా కేవలం చల్లటి నీళ్లలో నానబెడితే చాలు, క్షణాల్లో మెత్తటి అన్నం సిద్ధమైపోతుందని చెబితే నమ్ముతారా? వినడానికి ఏదో మేజిక్ లా అనిపించినా ఇది నిజం. అస్సాంలో పండే ఓ ప్రత్యేకమైన వరి రకం విశేషమే ఇది. ఆ బియ్యాన్ని అక్కడ ‘చొకువా’ లేదా ‘కోమల్ సావుల్’ అని పిలుస్తారు. దీనికి ఉన్న విచిత్రమైన క్వాలిటీ వల్లే అందరూ దీన్ని సరదాగా ‘మేజిక్ రైస్’ అని పిలుచుకుంటారు.
ఈ మేజిక్ రైస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటంటే, దీనికి వంటగది, కుక్కర్, కట్టెల పొయ్యి లేదా కరెంట్ లాంటి సాధనాలు ఏవీ అవసరం లేదు. కేవలం ‘నానబెట్టడం.. తినడం’ అంతే! మామూలు నీళ్లలో లేదా కాస్త గోరువెచ్చని నీటిలో ఈ బియ్యాన్ని కాసేపు ఉంచితే చాలు. చల్లటి నీళ్లయితే ఓ 40 నుంచి 45 నిమిషాల్లో, అదే కాస్త గోరువెచ్చటి నీళ్లయితే అంతకంటే తక్కువ సమయంలోనే బియ్యం ఉబ్బినట్లుగా మెత్తగా, తినడానికి వీలుగా మారిపోతాయి. ఆ తర్వాత నీటిని వడకట్టేసి నేరుగా తినేయవచ్చు. అసలు ఉడకబెట్టకుండానే ఈ బియ్యం ఎలా మెత్తగా అవుతుందో అని అందరికీ సందేహం రావడం సహజం. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. సాధారణంగా మనం తినే బియ్యంతో పోలిస్తే, ఈ చొకువా బియ్యంలో ‘అమైలోజ్’ అనే స్టార్చ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్టార్చ్ తక్కువగా ఉండటం వల్లే నీటి తడి తగలగానే ఆ గింజలు నీటిని త్వరగా పీల్చుకుని, ఉడికించిన అన్నంలా సాఫ్ట్‌గా మారిపోతాయి.
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
ఇది నిన్న మొన్న మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం ఏమీ కాదు. అస్సాం సంప్రదాయంలోనూ, అక్కడ ప్రజల ఆహార అలవాట్లలోనూ శతాబ్దాలుగా ఈ బియ్యం ఒక భాగమైంది. అస్సామీలు దీన్ని రకరకాలుగా తింటారు. పాలు, పెరుగు, బెల్లం, చక్కెర, అరటిపండ్లు, పచ్చళ్లు లేదా చివరికి ఉప్పు-నూనె కాంబినేషన్‌తో కూడా ఈ అన్నాన్ని ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. ఉదయపు టిఫిన్‌గా కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మేజిక్ రైస్ వల్ల ప్రయాణికులకు, కొండలు ఎక్కే ట్రైకర్లకు, అలాగే నిప్పు రాజేసే సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండే సైనికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు గ్యాస్ లేదా విద్యుత్ సౌకర్యం లేకపోయినా, ఈ బియ్యం వెంట ఉంటే ఆకలి బాధ ఉండదు.
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..