Site icon NTV Telugu

Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత సైన్యం అత్యవసర మీడియా సమావేశం..

Sindoor

Sindoor

Operation Sindoor: పాకిస్తాన్‌లో భారత్ విధ్వంసం సృష్టిస్తోంది. పాకిస్తాన్ రెండు రోజులుగా చేస్తున్న డ్రోన్ దాడులకు ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేస్తూ భారీ దాడులు చేసింది. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి లక్ష్యంగా వీరంగం సృష్టించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ బేస్‌ని ధ్వంసం చేసింది. దీంతో పాటు రఫికీ ఎయిర్ బేస్, మురిద్ ఎయిర్ బేస్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. వస్తున్న సమాచారం ప్రకారం, పాక్ వ్యాప్తంగా అన్ని ఎయిర్ బేస్‌లను నాశనం చేసినట్లు తెలుస్తోంది. లాహోర్, ఇస్లామాబాద్, సియాల్‌కోట్ ‌లపై దాడులు జరిగాయి.

Read Also: Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..

ఇదిలా ఉంటే, ఈ రోజు తెల్లవారుజామున 10 గంటలకే ఇండియన్ మిలిటరీ మీడియా సమవేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. పాకిస్తా్న్ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌత్ బ్లాక్ లో మీడియా సమావేశం జరగబోతోంది.

Exit mobile version