Pakistan Minister: ఔరంగజేబు పాలనతో తప్పా భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు..
- ఔరంగజేబు సమయంలోనే భారత్ ఐక్యంగా ఉంది..
- భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు..
- మోడీ ప్రజాదరణ తగ్గింది..
- హాస్యస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ రక్షణ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Minister: ఆపరేషన్ సిందూర్‌తో తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు. ఆ దేశ ముఖ్య నేతలు భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత దాడి సమయంలో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసిన నవ్వుల పాలైన ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత చరిత్ర తెలియకుండా మాట్లాడి నవ్వులపాలయ్యారు. ‘‘ఔరంగజేబు సమయంలో తప్పా, భారత్ ఎప్పుడూ ఐక్యం లేదు’’ అని అన్నారు.
‘‘ ఔరంగజేబు సమయంలో తప్పా, భారత్ నిజంగా ఎప్పుడూ ఐక్యం లేదని చరిత్ర చెబుతోంది. అల్లాహ్ పేరుతో పాకిస్తాన్ ఏర్పడింది. స్వదేశంలో మేము వాదిస్తాము, పోటీ పడుతాము. కానీ భారతదేశంతో పోరాటం విషయంలో కలిసి వస్తాము’’ అని ఆయన సమా టీవీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
- Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
- Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
Read Also: Myanmar: మయన్మార్ బౌద్ధ ఉత్సవంపై బాంబు దాడి.. 24 మంది మృతి
నిజానికి మొఘలుల కన్నా ముందు నుంచే భారత్ ఐక్యంగా ఉంది. తురుష్కల దండయాత్రలకు ముందు నుంచే భారతదేశాన్ని చాలా రాజ వంశాలు పాలించాయి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్ధంలో చంద్రగుప్త మౌర్యుడి పాలనలో మౌర్య సామ్రాజ్యం దాదాపు భారత్ అంతా విస్తరించింది. ఆ తర్వాత అశోకుడు ఇప్పుడు ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ను కలుపుకుని భారతదేశాన్ని ఏలారు. సముద్రగుప్తుడు, హర్షుడు కూడా భారతదేశాన్ని పాలించారు.
ఇదిలా ఉంటే, తనకు బుద్ధి లేదని ఖవాజా ఆసిఫ్ మరోసారి నిరూపించుకున్నారు. భారతదేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. భారత్-పాకిస్తాన్ వివాదంలో తటస్థంగా ఉన్న దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ శిబిరంలో చేరాయని చెప్పాడు. భారతదేశానికి మద్దతు ఇస్తున్న వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.
పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య బీహార్ ఎన్నికల కోసమే అని ఆసిఫ్ చెప్పడం మరింత హాస్యాస్పదంగా మారింది. పాకిస్తాన్ ఆపరేషన్ బన్యన్ అల్ మార్సుస్ ప్రారంభించినప్పటి నుంచి మోడీ ప్రజాదరణ తగ్గిందని, మోడీని సమర్థించే వారు ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశాన్ని దాని యుద్ధ విమానాల కింద పాతిపెడతా అని బెదిరించిన తర్వాత ఆసిఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
తాజావార్తలు
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!