DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
- డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు..
- ఇప్పటికే ఒక మంత్రి రాజీనామా..
- మరో ముగ్గురిలో అసంతృప్తి..
- కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యను దించి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన డీకేకు మంత్రులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే, సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రాధాన్యత లేని శాఖను కేటాయించిన కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, కేబినెట్లోని మరో ముగ్గురు మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, మంత్రి వర్గంలో సిద్ధరామయ్య అనుచరగణం భారీ సంఖ్యలో ఉండటం, డీకేకు భవిష్యత్తులో ఇబ్బందులను కలుగజేస్తాయని భావిస్తున్న తరుణంలో, కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
కేబినెల్లోని సీనియర్ మంత్రులు తమకు మరిన్ని కీలక బాధ్యల్ని కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళలు, ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. రామలింగారెడ్డికి బెంగుళూరు అభివృద్ధి శాఖను కేటాయిస్తారని అనుకున్నా, నీటి పారుదల శాఖను కేటాయించడంపై అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కే.హెచ్ మునియప్ప, కే.జి జార్జ్, సతీష్ జార్కిహోళిలు కూడా సమస్యగా మారారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
మునియప్ప తన సీనియారిటీకి తగిన శాఖలు ఇవ్వలేని అసంతృప్తితో ఉన్నారు. జార్జ్ తన శాఖలో అధికారుల బదిలీలపై జోక్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మంత్రి పదవితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించిన సతీష్ జార్కిహోళి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విభేదాలను పరిష్కరించుకుంటామని డీకే శివకుమార్ చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంతోషం డీకేకు ఉండనివ్వకుండా చేస్తున్నారు.
డీకే కేబినెట్లో మహిళా మంత్రికి చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా్యి. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత మార్గరేట్ ఆల్వా నిరాశ వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడుతూ, త్వరలోనే మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ప్రస్తుతం, కేబినెట్లో యూటీ ఖాదర్ ఒక్కరే ముస్లిం మంత్రిగా ఉన్నారు. నలుగురు మంత్రులకు చోటు కల్పించాలని ముస్లిం నేతలు, మతపెద్దలు డిమాండ్ చేస్తు్న్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!