Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
- బీజేపీకి అన్నామలై రాజీనామా..
- తమిళనాడు రాజకీయాల్లో ప్రభావం..
- భవిష్యత్తు విజయ్-ఉదయనిధి-అన్నామలైదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీకి అన్నామలై గుడ్‌బై చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఒక రకంగా చెప్పాలంటే, అన్నామలై రాజీనామా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. తమిళనాడులో సింగిల్ డిజిట్‌కు పరిమితమైన పార్టీ ఓట్ షేర్‌ను 11 శాతానికి తీసుకువచ్చిన ఘటన అన్నామలైదే.
అయితే, అన్నామలై కొత్త రాజకీయ వేదిక తమిళనాడు రాజకీయాలను రీసెట్ చేయబోతోంది. ఇన్నాళ్లు ద్రవిడవాదం ఆధారంగా నడిచిన రాజకీయాలుకు పోటీ ఇచ్చేలా అన్నామలై రూపంలో జాతీయవాద రాజకీయాలు ఉండే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తమిళ రాజకీయాలు ఇప్పుడు కొత్త తరానికి ప్రవేశిస్తున్నాయి. సాంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు విజయ్, అన్నామలై రూపంలో కొత్త సవాళ్లు ఎదురవ్వడం ఖాయం.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
విజయ్-ఉదయనిధి-అన్నామలై శకం ప్రారంభం:
తమిళ రాజకీయాలను గత 50 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకేలు శాసిస్తూ వచ్చాయి. అయితే విజయ్ రూపంలో వీటికి అడ్డుకట్టపడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే బంపర్ విక్టరీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాన్ని డీఎంకే, అన్నాడీఎంకేలు అసలు ఊహించలేదు.
ప్రస్తుతం ఉన్న స్టాలిన్, పళనిస్వామి శకం ముగుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్టాలిన్ వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ డీఎంకేను నడిపించవచ్చు. అయితే, అన్నాడీఎంకే పళనిస్వామి నేతృత్వంలో ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుందో చెప్పలేని విధంగా ఉంది. బలమైన మాస్ లీడర్ లేకపోవడంతో అన్నాడీఎంకే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవచ్చు. ఈ నేపథ్యంలోనే అన్నామలై కొత్త పార్టీతో రాక తమిళ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.
రాబోయే కాలం విజయ్, ఉదయనిధి స్టాలిన్, అన్నామలైలదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా తమ ప్రభావాన్ని కోల్పోవడం ఖాయం. ఈ రెండు పార్టీలు తోక పార్టీలుగా మిగులుతాయి. ఈ ముగ్గురు యువనేతలు రాబోయే కాలంలో తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారు.
- Tags
- annamalai
- bjp
- DMK
- Tamil Nadu
- TVK
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!