PM Modi: ఇండియా కూటమి “సనాతన ధర్మాన్ని” అంతం చేయాలనుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తొలిసారిగా బహిరంగంగా ప్రధాని మోడీ స్పందించారు. మధ్యప్రదేశ్ లో బీనాలో ఆయన పలు అభివృద్ధి పథకాలను శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో సనాతన వ్యాఖ్యలపై మాట్లాడారు. “ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని భావిస్తోందని” వ్యాఖ్యానించారు. మరో వెయ్యేళ్లు బానిసత్వం వైపు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్లకు స్పూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని ఈ కూటమి తుడిచేయాలని అనుకుంటోందని ఆరోపించారు. బహిరంగంగా సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారని, రేపు మనపై కూడా దాడులను పెంచుతారని, దేశవ్యాప్తంగా ఉన్న సనాతనవాదులు, దేశాన్ని ప్రేమించే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని అరికట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.
Also Read
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
Read Also: Madhya Pradesh: చికెన్ ఇవ్వలేదని షాప్ యజమాని బుర్రపగులగొట్టి పరారైన యువకులు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ(కాంగ్రెస్) అవినీతి, నేరాలు తప్పా ఇంకేం ఇవ్వలేదని ప్రధాని విమర్శించారు. జీ20 ఎంత విజయవంతమైందో మీరంతా చూశారు, ఈ ఘనత దేశ ప్రజలకు దక్కుతుందని ఆయన అన్నారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయమని పేర్కొన్నారు. బీనాలో రిఫైనరీలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చడంలో దోహదపడుతుందని.. ఆధునిక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ బీనాను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, దీంతో కొత్త పరిశ్రమలు ఇక్కడకు వస్తాయని, ఎంఎస్ఎంఈ అవకాశాలు లభిస్తాయని, యువతకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని ప్రధాని తెలిపారు. రూ.50,000 కోట్ల ప్రాజెక్టులను ఈ రోజు మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రప్రజలను కలుసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలస్తూ దాన్ని నిర్మూలించాలని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ మరోనేత ఏ రాజా మాట్లాడుతూ.. సనాతన ధర్మం ఎయిడ్స్, కుష్టు వంటిదని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారి తీశాయి. ముఖ్యంగా పలు హిందూ సంఘాలు, బీజేపీ పార్టీ డీఎంకే, కాంగ్రెస్ పార్టీలను, ఇండియా కూటమిని టార్గెట్ చేశాయి. ఇండియా కూటమికి హిందువులంటే ద్వేషం అంటూ బీజేపీ ఆరోపించింది.
#WATCH | Bina, Madhya Pradesh: Prime Minister Narendra Modi says "The people of this INDIA alliance want to erase that 'Sanatana Dharma' which gave inspiration to Swami Vivekananda and Lokmanya Tilak…This INDIA alliance wants to destroy 'Sanatana Dharma'. Today they have openly… pic.twitter.com/wc0C2hBxtS
— ANI (@ANI) September 14, 2023
తాజావార్తలు
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.