India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
- అమెరికా దాడులపై భారత్ సీనియస్..
- యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు జారీ..
- గల్ఫ్‌లో భారత వాణిజ్య నౌకలపై అటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India summons US: గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడుల నేపథ్యంలో భారత్ సీరియస్ అయింది. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై యూఎస్ దాడి నేపథ్యంలో, ఈ వారంలో రెండోసారి అమెరికా దౌత్యవేత్త జసన్ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో భారత సిబ్బంది ఉన్న నౌకలపై మూడు సార్లు దాడులు చేసింది. ఈ ఘటనపై భారత్, అమెరికా దౌత్యవేత్త జాసన్ మీక్స్‌ను పిలిపించి చర్చించినట్లు తెలుస్తోంది. వరసగా జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే గల్ఫ్, హార్ముజ్ జలసంధి, సమీప సముద్ర ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది భారతీయ సిబ్బందికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read
- Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
- Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
- Congress: "అఖండ కాంగ్రెస్".. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
- Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
జూన్ 08న ఎంటీ మారివెక్స్ అనే నౌకపై దాడి జరగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ నౌకలో ఉన్న 24 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. జూన్ 10న ఎంటీ సెట్టేబెల్లో అనే ట్యాంకర్ ఒమన్ తీరంలో దాడికి గురైంది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉంటే, 21 మంది సురక్షితంగా బయటపడగా, ముగ్గురు మరణించారు. గురువారం మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది.
ప్రస్తుతం హార్ముజ్ జలసంధికి సమీపంలో ప్రయాణిస్తున్న 13 భారత జెండా కలిగిన నౌకల్లో 622 మంది భారతీయ నావికులు ఉన్నారు. గల్ఫ్ ప్రాంతంలో వందలాది విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో దాదాపు 18 వేల మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద సముద్ర కార్మిక శక్తి భారత్‌దే. సముద్ర భద్రత ప్రమాదంలో ఉంటే ప్రభావితమయ్యే దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.
తాజావార్తలు
-
India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
-
VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్‌కు ముగింపు
-
Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!