PM Narendra Modi, Pak PM Shehbaz Sharif MEETING may take place: పుల్వామా, యూరీ ఘటనల తరువాత ఇండియా-పాకిస్తాన్ సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటనల తరువాత సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ తో ఇండియా, పాకిస్తాన్ కు సమాధానం ఇచ్చింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం చాలా వరకు తగ్గింది. ఇక దౌత్యపరమైన సమావేశాలు కూడా జరగలేదు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేని విధంగా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే రెండు సరిహద్దు దేశాల ప్రధానులు గత ఆరేళ్లలో కలిసిన దాఖలాలు లేవు. ఏ అంతర్జాతీయ సమావేశంలో కూడా ఇరు దేశాల నేతలు ఒకే వేదికను పంచుకోలేదు.
Read Also: Colour Photo: జాతీయ అవార్డు విన్నింగ్ సినిమా.. మెగా డాటర్ మిస్ అయ్యిందే..?
అయితే చాలా రోజుల తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ లు ఒకే వేదికపై కలిసే అవకాశం ఏర్పడింది. ఇరు దేశాల నేతలు సమావేశం అయ్యే అవకాశాన్ని దౌత్యవేత్తలు కొట్టిపారేయడం లేదు. వచ్చే సెప్టెంబర్ 15-16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ సమర్ ఖండ్ లో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీ ఓ) వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను ఆహ్వానించనున్నారు. ఈ సమావేశాల వేదికగా ఇరు దేశాల నాయకులు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా, ఇండియా, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, కజకిస్తాన్ దేశాలు ఎస్ సీ ఓ కూటమిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. శాంతి, స్థిరత్వాన్ని సాధించేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, ఆహార భద్రతపై ఎస్ సీ ఓ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. భాగస్వామ్య దేశాల మధ్య కస్టమ్స్ విధానాలు డిజిటలైజ్ చేయడంతో పాటు అంతర్గత- ప్రాంతీయ వాణిజ్యం అభివృద్ధి కోసం ప్రణాళిక రూపకల్పన వంటివి చర్చించనున్నారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ కు ప్రస్తుతం భారత్ తో వాణిజ్యం చాలా అవసరం. ద్రవ్యోల్భనం, నిత్యావసరాల రేట్లు పెరుగుదల, పేదరికం, కరెంట్ కోతలు, అప్పుల్లో చిక్కుకుంది పాకిస్తాన్. శ్రీలంక తరువాత స్థానంలో నిలిచింది. ఇలాంటి సమయంలో భారత్ నుంచి వాణిజ్యం, వ్యాపారం బలపడితే కొంతలో కొంత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మెరగయ్యే అవకాశం ఉంది.