పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం అన్నారు.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము సపోర్టు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. అయితే, చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఇరు దేశాలే నిర్ణయించుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పుకొచ్చారు.
PM Narendra Modi, Pak PM Shehbaz Sharif MEETING may take place: పుల్వామా, యూరీ ఘటనల తరువాత ఇండియా-పాకిస్తాన్ సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటనల తరువాత సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ తో ఇండియా, పాకిస్తాన్ కు సమాధానం ఇచ్చింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం చాలా వరకు తగ్గింది. ఇక దౌత్యపరమైన సమావేశాలు కూడా జరగలేదు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేని విధంగా తగ్గిపోయాయి.