DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- ఖైరతాబాద్‌లో ఓటమి భయంతోనే కోర్టు పిటిషన్లంటూ డీకే అరుణ ఆరోపణ
- పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు వైపులంటూ విమర్శలు
- రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్న డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే ముందస్తు భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టు ద్వారా పిటిషన్లు వేయించారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఖైరతాబాద్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని స్పష్టం కావడంతోనే కాంగ్రెస్ నాయకత్వంలో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు.
దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా తమ పాలనపై, పది నెలల్లో సాధించిన అభివృద్ధిపై విశ్వాసం ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డీకే అరుణ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు కనీస నైతికత ఉంటే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా కేంద్ర నిధులను కేటాయిస్తుంటే, ఇక్కడి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం రాష్ట్రాన్ని దారుణంగా అప్పుల పాలు చేశాయని ఆరోపించారు.
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
అభివృద్ధి శూన్యం.. ప్రజలు గుణపాఠం చెప్పాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని, ఈ రెండు పార్టీల పాలనలోనూ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నిధులు లేవంటూ చేతులు దులుపుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఈ రెండు పార్టీల వైఫల్యాలను, మోసపూరిత వైఖరిని గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లో భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆమె కోరారు.
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!