LPG Crisis: కష్టకాలంలో మిత్రదేశం సాయం.. 20,000 కి.మీ దూరం నుంచి భారత్‌కు LPG..
- కష్టకాలంలో మిత్రదేశం సాయం..
- 20 వేల కి.మీ దూరం నుంచి వంట గ్యాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, చమురు-గ్యాస్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ జలమార్గం ద్వారా 20 శాతం ఇంధన రవాణా జరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. భారత్‌లో ఈ సమస్య ఉంది. ముఖ్యంగా వంట గ్యాస్‌పై ప్రజలు భయాందోళనలో ఉన్నాయి. మనం దిగుమతి చేసుకునే LPGలో 60 శాతం గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతుండటంతో సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మిత్రదేశం భారత్ కోసం సాయానికి ముందుకు వచ్చింది. భారత్ సుదూరంలో ఉన్న అర్జెంటీ నుంచి LPGని దిగుమతి చేసుకునేందుకు మొగ్గు చూపుతోంది. 2024కు ముందు అర్జెంటీ నుంచి భారత్ గ్యాస్ సరఫరా అసలే లేదు. మోడీ ప్రభుత్వం ఇంధన దిగుమతుల కోసం కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడకుండా చాలా దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. కానీ 2026లో తొలి 3 నెలల్లోనే అర్జెంటీనా నుంచి భారత్‌కు 50,000 టన్నుల ఎల్పీజీ దిగుమతులు వచ్చాయి. 2025లో ఈ దేశం నుంచి భారత్ 22,000 టన్నుల దిగుమతులతో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా LPG దిగుమతులు పెరిగాయి.
Also Read
- Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
Read Also: Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
ఇప్పటికే అర్జెంటీనాలోని బహియా బ్లాంకా ఓడరేవు నుంచి ఎల్పీజీ నౌకలు బయలుదేరాయి. మార్చ్ మొదటి వారంలో భారత్ చేరుకుంటాయి. అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండంలో చిట్టచివర ఉంది. ఇక్కడి నుంచి భారత్ రావాలంటే నౌకలు సుమారుగా 20,000 కిలోమీటర్లు దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రంపై ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది అత్యంత పొడవైన నౌకా మార్గాల్లో ఒకటి. ఈ దూరం వల్ల రవాణా ఖర్చులు ఎక్కువ అవుతున్నా, గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో మాట్లాడుతూ.. తమ వద్ద అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్‌కు దీర్ఘకాలం గ్యాస్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత్ ఇప్పటికే అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్‌తో పాటు సోయాబీన్ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా దిగుమతి చేసుకుంటున్నాము.
#WATCH | Delhi: Reacting to the reports of India importing energy and gas from Argentina, Mariano Agustín Caucino, Ambassador of Argentina to India, says, "India is becoming the fourth-largest economy, and is going to be the third-largest economy. It's a great importer of energy,… pic.twitter.com/9b2VwtIR3x
— ANI (@ANI) March 25, 2026
తాజావార్తలు
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!